నల్లమల అటవీ ప్రాంతం ఒక్కసారిగా చల్లబడింది. నల్లమల్లలోని పలు ప్రాంతాల్లో కొన్ని చోట్ల మోస్తరు.. మరికొన్ని చోట్ల భారీ వర్షం కురిసింది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్, మన్ననూర్ మండలాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు.. ఉప్పునుంతల, వంగూరు, పదర మండలాల్లోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన కురిసింది.
ఉప్పునుంతల మండలంలోని వెల్టూరు గ్రామంలో ఎడతెరిపి లేకుండా వడగళ్ల వాన కురిసింది. వర్షం కుండపోతగా కురవడం వల్ల గ్రామాల్లోని రహదారులు, మురికి కాలువలు నిండిపోయాయి. రోజూ ఎండ వేడిమితో ఇళ్లలో ఉన్న ప్రజలకు ఈ వర్షం కాస్త ఉపశమనాన్ని ఇచ్చింది.
ఇదీ చూడండి: వైరస్‌కు ఉక్కపోత.. ఉష్ణ మండలంలో వ్యాప్తి తక్కువే!