నాగర్ కర్నూల్ జిల్లా లింగాలలో బుద్ధవనం గార్డెన్, ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్ పార్క్‌ను అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ప్రారంభించారు. పురాతన చరిత్ర గల సబ్ జైలును పార్కుగా తీర్చిదిద్దేందుకు కృషి చేసిన సర్పంచ్ కోనేటి తిరుపతయ్యను అభినందించారు. అనంతరం అదనపు కలెక్టర్ మను చౌదరితో కలిసి జిమ్‌లో కాసేపు వ్యాయామం చేశారు.
ప్రజలు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడం కోసం ఓపెన్ జిమ్ పార్క్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి కష్ట సుఖాల్లో తోడుంటానని ఎమ్మెల్యే బాలరాజు తెలిపారు.