పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పారదర్శకంగా నిర్వహించాలని ఎన్నికల సిబ్బందికి నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్ సూచించారు. వారికి ఎన్నికల నియమావళిని వివరించారు. ఆదివారం జరగనున్న పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అన్ని రకాల వసతులు కల్పించేందుకు ఏర్పాట్లు చేశామని శర్మన్ అన్నారు. కరోనా నిబంధనల మధ్య పోలింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు. జిల్లాలో 44 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. 33,925 మంది ఓటర్లు ఉండగా, పురుషులు - 23,718, మహిళలు - 10,202 మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. 380 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించనున్నారని తెలిపారు.
ఎన్నికల సిబ్బంది.. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఇతర సామగ్రి తీసుకుని తమకు కేటాయించిన పోలింగ్ సెంటర్లకు తరలివెళ్లారు.