ప్రజల పట్ల తెరాస నాయకులు, కార్యకర్తల పట్ల స్థానిక పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి మండిపడ్డారు. నాగర్ కర్నూల్ జిల్లా పట్టణ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
పోలీసుల తీరు ఒక వర్గానికి మాత్రమే లబ్ధి చేకూర్చే విధంగా ఉందని ఇష్టారీతిన తన వెంట ఉన్న కార్యకర్తలు, నాయకులపై కేసులు బనాయించి బెదిరింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. తెరాస ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ.. ఇక్కడ మాత్రం పూర్తిగా విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇకనైనా పోలీసులు వారి తీరు మార్చుకోవాలని ఆయన సూచించారు.
ఇదీ చదవండి: 'పూర్తిగా కప్పి ఉంచే కళ్లజోళ్లు పెట్టుకోవడం మేలు'