నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తిలో భాజపా ఆధ్వర్యంలో గాంధీ సంకల్ప యాత్ర నిర్వహించారు. జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి, నాగర్‌కర్నూల్ పార్లమెంటు ఇంఛార్జి బంగారు శృతి ముఖ్యఅతిథుగా హాజరై యాత్ర ప్రారంభించారు. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మహాత్మా గాంధీ కలలుగన్న భారతదేశాన్ని తీర్చిదిద్దేందుకే ఈ యాత్ర ప్రారంభించినట్లు ఆచారి తెలిపారు. ఈ యాత్ర పార్లమెంటు నియోజకవర్గంలో 150 కిలోమీటర్ల మేర కొనసాగనుందన్నారు. అనంతరం ఆర్టీసీ కార్మికుల సమ్మె శిబిరం వద్దకు వెళ్లి సంఘీభావం తెలిపారు.
ఇవీ చూడండి : 'కేసీఆర్ తాతా... మమ్మీవాళ్లను చర్చలకు పిలవండి'