దివ్యాంగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు రాష్ట్రంలోనే ప్రథమంగా దివ్యాంగుల ప్రజావాణిని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్ ప్రారంభించారు. ప్రజావాణి సమావేశ మందిరంలో కలెక్టర్ ఎల్ శర్మన్ చౌహన్, అదనపు కలెక్టర్ మను చౌదరి, ఐసీడీఎస్ జిల్లా శాఖ అధికారి శ్రీమతి ప్రజ్వలతో కలిసి ప్రారంభించారు. దివ్యాంగుల సమస్యలను ఎప్పటికప్పుడు తీర్చేలా వారి సౌలభ్యం ఈ వెసులుబాటు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి నెల మూడో శనివారం 11 గంటల నుంచి 12 గంటల వరకు వారి కోసం అధికారులు అందుబాటులో ఉంటారని చెప్పారు. దివ్యాంగులు ఇచ్చే వినతులు జిల్లా స్థాయిలో ఉంటే త్వరగా పరిష్కరిస్తామని రాష్ట్ర స్థాయిలో ఉంటే వాటిని పై అధికారులకు పంపుతామన్నారు.
మొదటిరోజు 4 ఫోన్ కాల్స్, పదకొండు వాట్సాప్ పిటిషన్ దివ్యాంగుల నుంచి వినతులు వచ్చాయి. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండడం వల్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. నల్లమల ప్రాంతం అమ్రాబాద్ మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు పగిడి పాల పాండు రాష్ట్ర స్థాయి ఉత్తమ ప్రధాన ఉపాధ్యాయుడిగా ఎంపికైన సందర్భంగా ఆయనకు ప్రభుత్వం నుంచి రూ. 10 వేల చెక్కు, బంగారు పతకం, శాలువాతో సన్మానించారు.