నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటీవల ఎక్కువగా విద్యుదాఘాతం, గ్యాస్ సిలిండర్లు పేలి అగ్ని ప్రమాదాలు జరగటం పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఓ వ్యక్తి అగ్నిప్రమాదానికి గురైనప్పుడు, ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలను వివరించారు. ప్రధానంగా ఎలాంటి అగ్నిప్రమాదమో గుర్తించాలని సూచించారు. అనంతరం 100, 108కు తప్పనిసరిగా సమాచారం అందించాలని అగ్నిమాపక సిబ్బంది పేర్కొన్నారు.
ఇవీ చూడండి: 'ప్రైవేటు సంస్థల్లో ఆధార్ ధ్రువీకరణ చట్టబద్ధమేనా?