నాగర్ కర్నూలు, రంగారెడ్డి జిల్లాల్లో వడగండ్ల వాన రైతన్నలకు కడగండ్లు మిగిల్చింది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి, మాడుగుల మండలాల్లో కురిసిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టం మిగిల్చింది. ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన వల్ల ఈ మండలాల్లో వరి, మామిడి తోటల రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. విద్యుత్ స్తంభాలు విరిగి పోవడం ద్వారా పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
ఆరుగాలం కష్టపడితే చేతికొచ్చిన పంటలు బుగ్గిపాలయిందని రైతులు వాపోతున్నారు. నష్టాన్ని గుర్తించి ఆదుకోవాలని పలువురు రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇదీ చూడండి: కరోనా కాలాన పరీక్షా సమయమిది!