నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం వద్ద జంగారెడ్డిపల్లి, తిమ్మరాశిపల్లి గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. పదిరోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు యూటీ కాల్వకు గండి కొట్టడం వల్ల... కేఎల్‌ఐ కాలువ ఆయకట్టులో సాగు చేసిన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆరోపించారు. ఈ దుశ్చర్యపై ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: మద్యం దుకాణాల లైసెన్సుల గడువు పెంపు!