ETV Bharat / state

Etela on CM KCR: నిరుద్యోగులు, రైతులను సీఎం కేసీఆర్‌ మోసం చేశారు: ఈటల - cm kcr

Etela Rajender on CM KCR: నిరుద్యోగులు, రైతులు, దళితులను మోసం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్​ ఇంటి ముందే చావు డప్పు కొట్టాలని భాజపా నేత ఈటల రాజేందర్​ అన్నారు. నాగర్ కర్నూల్​ జిల్లా కొల్లాపూర్‌లో రెండోరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా శిక్షణ శిబిరానికి హాజరైన ఈటల.. తెరాస ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

Etela on CM KCR: నిరుద్యోగులు, రైతులను సీఎం కేసీఆర్‌ మోసం చేశారు: ఈటల

author img

By

Published : Dec 20, 2021, 5:35 PM IST

Etela Rajender on CM KCR: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తెలంగాణ సబ్బండ వర్గాలను వంచించిన సీఎం కేసీఆర్‌ ఇంటి ముందు చావుడప్పు కొట్టాలని భాజపా నేత ఈటల రాజేందర్‌ విమర్శించారు. నిరుద్యోగులు, రైతులు, దళితులను మోసం చేసింది ముఖ్యమంత్రి అని ఈటల స్పష్టం చేశారు. నాగర్ కర్నూల్​ జిల్లా కొల్లాపూర్‌లో రెండోరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా శిక్షణ శిబిరానికి హాజరైన ఈటల.. తెరాస ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

శాంతి భద్రతలు కాపాడాల్సిన సీఎం దాడులు చేయాలంటున్నారని ఆయన విమర్శించారు. తన తప్పులు కప్పిపుచ్చుకునేందుకే సీఎం కొత్త నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ లేదని ఈటల రాజేందర్‌ అన్నారు. ప్రగతిభవన్‌కు ఇనుప కంచె వేసి ఎవరినీ లోపలికి రానివ్వరని ఆయన పేర్కొన్నారు. హుజూరాబాద్‌ దెబ్బతో కేసీఆర్‌ ఫామ్‌హౌస్​ నుంచి బయటికి వచ్చారని ఈటల అన్నారు.

Etela on CM KCR: నిరుద్యోగులు, రైతులను సీఎం కేసీఆర్‌ మోసం చేశారు: ఈటల

కప్పిపుచ్చుకునేందుకే కొత్త నాటకాలు

'శాంతి భద్రతలు కాపాడాల్సిన సీఎం దాడులు చేయాలంటున్నారు. తన తప్పులు కప్పిపుచ్చుకునేందుకే సీఎం కొత్త నాటకాలు. నిరుద్యోగులు, రైతులను సీఎం కేసీఆర్‌ ఇంటి ముందే చావుడప్పు కొట్టాలి. రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ లేదు. ప్రగతిభవన్‌కు ఇనుప కంచె వేసి ఎవరినీ లోపలికి రానివ్వరు. హుజూరాబాద్‌ దెబ్బతో కేసీఆర్‌ ఫామ్‌హౌస్​ నుంచి బయటికి వచ్చారు.'

-ఈటల రాజేందర్​, భాజపా నేత

ఇదీ చదవండి:

Ministers Protest over paddy procurement : మోతెత్తిన చావుడప్పు.. కేంద్రం తీరుపై భగ్గుమన్న మంత్రులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.