నాగర్ కర్నూల్ జిల్లాలో డాక్టర్ బాబు జగ్జీవన్ రాం 114 వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్‌లోని ఆయన చిత్రపటానికి అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఉప ప్రధానిగా దేశానికి ఆయన చేసిన సేవలు ఆదర్శనీయమని కొనియాడారు.
అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్ రాం అని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. యువత మహనీయుని ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: నక్సల్స్ చెరలో కోబ్రా కమాండో- నిజమెంత?