మహిళల్లో వచ్చే గర్భాశయ, రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించడానికి కర్ణాటక రాష్ట్రం బెలగావ్కు చెందిన డాక్టర్ నమ్రతా సింగ్ సాహసయాత్ర చేపట్టారు.
వైద్యవృత్తికి రాజీనామా చేసిన ఆమె దేశవ్యాప్తంగా ఈ వ్యాధులపై అవగాహన కల్పించేందుకు సెప్టెంబర్ 1న ఛత్తీస్‌గఢ్ జగదల్పూర్ నుంచి బైక్ యాత్ర మొదలుపెట్టారు. సుమారు 16వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ... నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తికి చేరుకున్నారు.
కల్వకుర్తిలోని బాలికల ఉన్నత పాఠశాలలోని విద్యార్థినులకు గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. చిన్న వయసులోనే ఈ వ్యాధుల గురించి తెలిస్తే.. భవిష్యత్‌లో ఇవి సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటారని అందుకే ప్రాథమిక పాఠశాలు, కళాశాలల స్థాయి విద్యా సంస్థలు సందర్శిస్తున్నట్లు నమ్రత తెలిపారు.