నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం చెదురుబావి తాండా గ్రామంలో గంజాయి సాగుపై పోలీసులు దాడులు నిర్వహించారు. ధర్మ అనే రైతు అక్రమంగా గంజాయి సాగుచేస్తున్నట్టు సమాచారం తెలుసుకున్న అచ్చంపేట సీఐ రామకృష్ణ.. సిబ్బందితో తనిఖీలు చేశారు. పొలంలో పత్తి, కంది చేను పంటలో అంతర పంటగా సాగుచేసి అమ్మడానికి సంచులలో ఉంచారు.
సుమారు 35 కిలోల గంజాయి సంచులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సాగుచేస్తున్న దాస్య, ధర్మ అనే ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ రామకృష్ణ తెలిపారు.
ఇదీ చూడండి : పెయింట్ డబ్బాలు పడేస్తున్నారా... తస్మాత్ జాగ్రత్త!