కరోనా వ్యాప్తి నివారణపై ప్రతి గ్రామపంచాయతీలో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశామన్నారు నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీధర్. కొవిడ్ బాధితుల కోసం జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డును ఆయన పరిశీలించారు. ఐసోలేషన్ వార్డులో మంచాలు, బెడ్ షీట్లు, ఐసీయూ వార్డు, స్నానపు గదులను ఎప్పటికప్పుడు శుభ్ర పరచాలని సూచించారు.
అనంతరం ఆస్పత్రి వైద్యులతో సమావేశం నిర్వహించారు. కొవిడ్- 19కు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రతి వార్డుకు నలుగురు డాక్టర్లను కేటాయించారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని ఎవరూ కూడా విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించకూడదన్నారు. తాడూర్ కస్తూర్భా గాంధీ విద్యాలయంలో క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేశామని ప్రకటించారు. రోడ్లపై గుంపులు గుంపులుగా తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: సుప్రీంలో ఒకే ధర్మాసనం.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ