సహకార ఎన్నికల్లో ఓట్లు వేయడానికి ఓటర్లు బారులు తీరారు. ఓటింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉండడం వల్ల.. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్దకు తరలివచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 13 వార్డులకు గాను పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలో మొత్తం 23 సహకార సంఘాలు ఉండగా.. రెండు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 21 స్థానాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
జిల్లాలో మొత్తం 91 వేల 421 మంది ఓటర్లు ఉండగా.. అందులో 24 వేల 272 మంది మహిళా ఓటర్లు, 67 వేల 149 మంది పురుష ఓటర్లు ఉన్నారు. ఎన్నికల బరిలో 554 మంది అభ్యర్థులు ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.
ఇవీ చూడండి... రాజాంలో విద్యార్థి కిడ్నాప్ కలకలం