ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బంద్ పిలుపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆందోళనకు యత్నిస్తున్న శ్రేణులను ఎక్కడికక్కడే అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. నాగర్‌కర్నూల్‌లో ఆర్టీసీ డిపో వద్ద ధర్నాకు యత్నించిన... డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణతో పాటు కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు.
అనంతరం బిజినేపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తరువాత ఆర్టీసీ బస్సులు యథావిధిగా కొనసాగాయి. జిల్లా కేంద్రంలో దుకాణాలు వ్యాపార సంస్థలు తెరుచుకున్నాయి. ఎక్కడా కూడా బంద్ ఆనవాలు కనిపించడం లేదు. ఇటీవల కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంపుహౌస్ సందర్శనను అడ్డుకున్నారంటూ కాంగ్రెస్ నేతలు ఉమ్మడి పాలమూర్ బంద్‌కు పిలుపునిచ్చారు.