రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళిక కార్యక్రమం కేవలం 30 రోజులకే పరిమితం కాదని.. ఇది నిరంతర ప్రక్రియ అని నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ అన్నారు. జిల్లాలోని వెల్దండ మండలం కేంద్రంతో పాటు, నగరగడ్డ తండాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం వెల్దండ గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ.. తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీపీవో సురేశ్మోహన్, ఆర్డీవో రాజేశ్ కుమార్, వెల్దండ జడ్పీటీసీ విజితారెడ్డి.. ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : ఒకే కార్డుపై ఆధార్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్!