నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని కలెక్టర్ శర్మన్, జడ్పీ ఛైర్పర్సన్ పద్మావతి పరిశీలించారు. సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించిన 3,400 మందికి టీకాలు ఇస్తున్నామని కలెక్టర్ అన్నారు.
మొత్తం ఐదు కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కొనసాగుతోందని ఈ రోజు వరకే సూపర్ స్ప్రెడర్లకు అవకాశం ఉందని చెప్పారు. వ్యాక్సిన్ కేంద్రంలో భౌతిక దూరం పాటించాలని అన్నారు. మాస్కు లేకుండా బయటకు రావొద్దని జడ్పీ ఛైర్పర్సన్ సూచించారు.
ఇదీ చదవండి: Kishan Reddy: 'వ్యాక్సిన్ వినియోగంలో ప్రపంచంలోనే మూడోస్థానం'