క్విట్ ఇండియా 78వ వార్షికోత్సవం సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులను వారి ఇంటికే వెళ్లి సన్మానించాలన్న భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆదేశించారు. కాగా నాగర్‌కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోలు గ్రామంలో నివాసం ఉంటున్న స్వాతంత్య్ర సమరయోధుడు వెంకటరావును జిల్లా కలెక్టర్ శర్మన్ ఘనంగా సన్మానించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పరాయి దేశస్తుల పాలన నుంచి విముక్తి కల్పించేందుకు ఆనాడు మహాత్మాగాంధీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని మనందరికీ స్వేచ్ఛాయుతమైన స్వాతంత్య్రాన్ని అందజేశారని పేర్కొన్నారు.
అదే స్ఫూర్తితో మనమందరం కలిసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ ఆశయాలకు అనుగుణంగా గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని గ్రామస్థులకు కలెక్టర్ సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది స్వాతంత్య్ర సమరయోధులు ఉన్నారని.. అందులో ఒకరైన వెంకటరావుని సన్మానించడం చాలా సంతోషంగా ఉందని శర్మన్ హర్షం వ్యక్తం చేశారు.
ఇవీచూడండి: భారత్ బయోటెక్ ల్యాబ్‌ను సందర్శించిన మంత్రి కేటీఆర్