ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందికి సమయపాలన తప్పని సరిగా ఉండాలని టైమ్‌కి విధులకు హాజరవ్వకపోతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఎల్ శర్మాన్ చౌహాన్ హెచ్చరించారు. చిరుజల్లులు పడుతున్నా లెక్కచేయకుండా కాలినడకన నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
ఉదయం నేరుగా ఆర్డిఓ, జిల్లా పరిషత్, ఎంపీడీవో, డీఈఓ, మహిళా సమాఖ్య కార్యాలయాలను వెళ్లి పరిశీలించారు. అయితే ఆ సమయంలో ఉద్యోగ సిబ్బంది ఎవరూ విధులకు హాజరు కాకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించాలని ఆదేశించారు. కార్యాలయ ఆవరణ ప్రాంతాలను పరిశీలించి అపరిశుభ్రంగా ఉండడం గమనించి మరోసారి ఇలా కనిపిస్తే అందరిపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
ఇవీ చూడండి: వ్యవసాయ శాఖ క్రియాశీలకంగా మారాలి: సీఎం