నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట కాంగ్రెస్లో వర్గపోరు భగ్గుమంది. పీసీసీ అధికార ప్రతినిధి సతీశ్ మాదిగపై మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. అచ్చంపేట తహసీల్దార్ కార్యాలయంలో మున్సిపల్ ఓట్ల నమోదు అవకతవకలపై మాట్లాడేందుకు వెళ్లిన క్రమంలో సతీశ్ మాదిగపై దాడి జరిగింది.
వచ్చే ఎన్నికల్లో అచ్చంపేట ఎమ్మెల్యే టికెట్ తనదేనని సతీశ్ ప్రచారం చేసుకోవడం... పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడమే దాడికి కారణంగా తెలుస్తోంది. వంశీకృష్ణ నియంతలా వ్యవహరిస్తున్నారని సతీశ్ మాదిగ మండిపడ్డారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చూడండి: సీఎం కేసీఆర్ వాదన అనుమానాస్పదంగా ఉంది: షబ్బీర్ అలీ