ETV Bharat / state

జలవిద్యుత్​ కేంద్రంలో ప్రమాదంపై సీఐడీ విచారణ ప్రారంభం - తెలంగాణ తాజా వార్తలు

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంపై సీఐడీ విచారణ ప్రారంభమైంది. విచారణాధికారి గోవింద్ సింగ్ నాయకత్వంలో 25మందితో కూడిన బృందం... శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శించింది. ఘటన జరిగిన తీరు, ప్రమాదానికి కారణమైన పరిస్థితులు ఇతర అంశాల గురించి అధికారులు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం భూగర్భంలో ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.

జలవిద్యుత్​ కేంద్రంలో ప్రమాదంపై సీఐడీ విచారణ ప్రారంభం

author img

By

Published : Aug 23, 2020, 5:38 AM IST

శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో ప్రమాదానికి కారణాలపై ఉన్నతాధికారుల దర్యాప్తు ప్రారంభమైంది. ఘటనపై విచారణకు ఎలక్ట్రికల్, ఫోరెన్సిక్‌సైన్స్, సీఐడీ, స్థానిక పోలీసుల బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అగ్నిప్రమాదంలో భారీగా ప్రాణనష్టం జరగడం వల్ల... ముఖ్యమంత్రి కేసీఆర్‌ సీఐడీ విచారణకు ఆదేశించారు. దుర్ఘటనకు దారి తీసిన పరిస్థితులు, ప్రమాదానికి గల కారణాలను వెలికితీయాలని స్పష్టంచేశారు. అందులో భాగంగా సీఐడీ అధికారుల బృందం... శ్రీశైలం జలవిద్యుత్‌కేంద్రాన్ని సందర్శించింది.

తొలుత ఈగలపెంటలోని జెన్‌కో అతిథిగృహంలో సీఈ, డీఈ, ఈఈ స్థాయి అధికారులతో సమావేశమై.... ఘటన జరిగిన తీరు, ప్రమాదానికి కాణమైన పరిస్థితులు ఇతర అంశాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకుంది. అక్కడి నుంచి భూగర్భంలో ఘటన జరిగిన ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు. సొరంగంలో అవకాశం ఉన్నంత మేర లోపలికి వెళ్లి... అత్యవసర మార్గాలన్నింటినీ పరిశీలించారు.

మరోవైపు ప్రమాదంలో మృతుల ఆచూకీ కోసం.... సీఐఎస్​ఎఫ్​, ఎన్డీఆర్​ఎఫ్​, జెన్‌కో, పోలీస్, వైద్య, అగ్నిమాపక సిబ్బంది... సొరంగ మార్గంలోకి వెళ్లి ముమ్మరంగా గాలించారు. దట్టమైన పొగతో పాటు విద్యుత్ సరఫరా లేకపోవడంతో చీకట్లో లైట్లు వేసుకుని తీవ్రంగా శ్రమించారు. ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి అగ్నిమాపకయంత్రాలు, 108 వాహనాలతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ప్రత్యేక బలగాలు ఆక్సిజన్ సిలిండర్లు, బ్యాటరీ లైట్‌లతో గాలించి మృతులను వెలికితీశాయి. ఈ సాహసోపేత దృశ్యాలు వైరల్‌ అయ్యాయి.

జలవిద్యుత్​ కేంద్రంలో ప్రమాదంపై సీఐడీ విచారణ ప్రారంభం

ఇవీచూడండి: 20 గేట్ల ద్వారా సాగర్​ నీరు దిగువకు విడుదల!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.