నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. అటవీ భూముల్లో వ్యవసాయం ఆపాలని నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన అటవీ అధికారులను స్థానిక చెంచులు అడ్డుకున్నారు. అధికారులు నోటీసులను ఇళ్లకు అంటించడానికి ప్రయత్నించగా మహిళలు వారి వాహనాలకు అడ్డంగా పడుకున్నారు.
అటవీ భూముల్లో ఇరవై సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నామని చెంచులు తెలిపారు. ఇప్పుడు అధికారులు ఆ భూములను స్వాధీనం చేసుకుంటే తాము ఎలా బ్రతకాలని ప్రశ్నించారు. ప్రాణాలైనా అర్పిస్తాం కానీ భూములను వదులుకునే ప్రసక్తే లేదని చెంచులు తేల్చిచెప్పడంతో అటవీ అధికారులు చేసేదేమిలేక అక్కడి నుంచి వెనుదిరిగారు.
ఇదీ చదవండి: అంబులెన్స్‌లో గర్భిణి మృతిపై హైకోర్టు ఆందోళన