నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతం అమ్రాబాద్ మండలం జంగంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆదివాసి చెంచులు తేనే తీయడానికి శనివారం మధ్యాహ్నం బయలుదేరి వెళ్లారు. కొండపై ప్రాంతంలో ఎక్కుతుండగా... ప్రమాదవశాత్తు తాడు తెగి ముగ్గురు చెంచులు సుమారు 600 అడుగుల లోయలో పడిపోయారు. దాసరి బయన్న(35), దాసరి పెద్దులు(28), అక్కడికక్కడే మృతి చెందగా.. వెంకటయ్యకు తీవ్ర గాయాలయ్యాయి.
వారిని లోయలో నుంచి వెలికి తీయడానికి గ్రామస్థులు, స్థానికులు చాలా శ్రమించారు అయినా ఫలితంలేకుండా పోయింది. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ శర్మాన్ హుటాహుటిన అమ్రాబాద్ పీహెచ్సీకి వెళ్లారు. మృతదేహాలు తీసేందుకు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స అందిస్తామని వారి కుటుంబీకులకు హామీ ఇచ్చారు. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు పరామర్శించారు. ప్రభుత్వం నుంచి వారికి తగు సహాయం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
- ఇదీ చూడండి: ఆయోధ్యలో రామాలయ నిర్మాణం అప్పుడే!