నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ తాహసీల్దార్ కార్యాలయం ఎదుట భాజపా జిల్లా అధ్యక్షుడు ఏలేని సుధాకర్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అసెంబ్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేసిన తీర్మానం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇలాంటి పనులు చేస్తే కేసీఆర్‌కు ప్రజలే బుద్ధి చెబుతారని సుధాకర్ అన్నారు. భాజపా ఆధ్వర్యంలో సీఏఏ, ఎన్ఆర్సీని అమలు చేసేందుకు ఉద్యమం చేస్తామని తెలిపారు. బండి సంజయ్ నాయకత్వంలో రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతం తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు.
ఇవీచూడండి: 'ఏపీ నుంచి వచ్చిన ఉద్యోగులను తీసుకోలేం'