ETV Bharat / state

'దోపిడీ చేసేందుకే ఎల్​ఆర్​ఎస్ స్కీమ్​'

పేద ప్రజలను దోపిడీ చేసేందుకే ఎల్​ఆర్​ఎస్ స్కీమ్​ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిందని భాజపా ఎమ్మెల్సీ రాంచంద్రరావు ఆరోపించారు. ఎల్​ఆర్​ఎస్​ను భాజపా తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆయన పేర్కొన్నారు. నాగర్​కర్నూల్ జిల్లాలో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియలో భాగంగా ఆయన పాల్గొన్నారు.

bjp mlc ramchander rao comment on LRS scheme to exploit
'దోపిడీ చేసేందుకే ఎల్​ఆర్​ఎస్ స్కీమ్​'
author img

By

Published : Oct 9, 2020, 5:08 PM IST

ప్రభుత్వ ఖజానాను నింపడం కోసమే ఎల్​ఆర్​ఎస్ స్కీమ్​ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిందని భాజపా ఎమ్మెల్సీ రాంచంద్రరావు అన్నారు. నాగర్​కర్నూల్ జిల్లాలో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి పట్టభద్రులు అందరూ ఓటరు నమోదు ప్రక్రియలో పాల్గొనాలని కోరారు.

ఎల్​ఆర్​ఎస్ రేటు తగ్గించాలని.. లేదంటే ఆ స్కీమును పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు న్యాయం జరిగే వరకు తాము ఉద్యమిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెస్తున్న కొత్త విద్యుత్‌ చట్టం, రైతు చట్టాల వల్ల సామాన్య ప్రజలు, రైతులకు లాభం ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ చట్టాలను వ్యతిరేకించడం దారుణమని పేర్కొన్నారు.

ఇదీ చూడండి : 'ఆ 14 మంది పీపీఈ కిట్​ ధరించి ఓటు వేశారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.