జగన్ సర్కార్ మొదలుపెట్టిన పోతిరెడ్డిపాడు విస్తరణ పనుల వల్ల నాగర్ కర్నూల్ ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదముందని భాజపా రాష్ట్ర నాయకలు దిలీపాచారి ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్, జగన్కు మధ్య ఉన్న దోస్తి వల్ల రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టవద్దని ఆయన సూచించారు. జీవో 203 రద్దు కోసం ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ఈ ప్రాజెక్టు పనులు రద్దు చేయకపోతే జిల్లా ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.