నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట పరిధిలో రైతు వేదిక నిర్మాణానికి ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి భూమి పూజ చేశారు. సుమారు రూ.22 లక్షల వ్యయంతో రైతు వేదికను నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతుల అభ్యున్నతికి కృషి చేస్తోన్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని కొనియాడారు. రైతు వేదికలు అన్నదాతలకు ఎంతో ఉపయోగపడతాయని స్పష్టం చేశారు.
అన్నదాతలకు ఎంతో తోడ్పాటు..
రైతు బీమా, రైతు బంధు, రైతు రుణమాఫీ లాంటి పథకాలు కర్షకులకు ఎంతో తోడ్పాటు అందిస్తున్నాయన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించి.. ఎండాకాలంలోనూ చెరువుల్లో జల కళ వచ్చేలా ఏర్పాట్లు చేశారని ప్రశంసించారు. బీడు పడ్డ పంట పొలాలు నేడు సస్యశ్యామలంగా మారాయంటే అది కేసీఆర్ వల్లేనన్నారు. కార్యక్రమంలో అధికారులు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.