ETV Bharat / state

BHARATIYA VIDYA UTSAV: విద్యా వ్యవస్థపై 'భారతీయ విద్యా ఉత్సవ్‌'లో మేధోమథనం

వందేమాతరం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 10 నుంచి 15వ తేదీ వరకు 'భారతీయ విద్యా ఉత్సవ్‌ ' (Seminar on Education) నిర్వహించనున్నారు. మన చదువుల గతిని మార్చే విభిన్న పాఠ్య ప్రణాళికలు, విలక్షణ బోధన పద్ధతులను పరిచయం చేసే దిశగా అయిదు రోజులు మేధోమథన సదస్సులు నిర్వహిస్తామని వందేమాతరం ఫౌండేషన్‌ (vandemataram foundation)రాష్ట్ర కార్యదర్శి మాధవరెడ్డి తెలిపారు.

BHARATIYA VIDYA UTSAV
BHARATIYA VIDYA UTSAV
author img

By

Published : Nov 14, 2021, 9:52 AM IST

ఆచరణాత్మక విధానాలు, అక్షర సుగంధాలతో సుసంపన్నం కావాల్సిన మన విద్యావ్యవస్థ (Seminar on Education) నేడు అంగడి సరకుగా మారిందని ఆవేదన చెందుతున్నారా? విద్యార్థులను విద్యాలయాలు పాఠాలను బట్టీ పట్టే మరయంత్రాలుగా మార్చాయని మథనపడుతున్నారా? బాధ్యతలు, విలువలకు చోటు లేని వ్యవస్థగా.. మార్కులు, ర్యాంకులే ప్రధాన ధ్యేయంగా పరిస్థితి మారిపోయిందా? ఈ దుస్థితిని మార్చాలన్న సంకల్పంతో మీరు ఉన్నారా?

అందుకు ‘భారతీయ విద్యా ఉత్సవ్‌’ పేరుతో (BHARATIYA VIDYA UTSAV) భాషావేత్తలు, విద్యావేత్తలను ఒక వేదికపైకి తీసుకురావాలని వందేమాతరం ఫౌండేషన్‌ (vandemataram foundation)సంకల్పించింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తిలో ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న అక్షర వనంలో ఫిబ్రవరి 10 నుంచి 15వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవ్‌లో (BHARATIYA VIDYA UTSAV) పాల్గొని అభిప్రాయాలను చెప్పొచ్చు. సూచనలు, సలహాలను అందించవచ్చు. విద్యావేత్తలు, నిపుణులతో చర్చించవచ్చు. భారత్‌ వికాస్‌ సంఘం(బీవీఎస్‌) సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

మొదటి రోజు ప్రారంభోత్సవం, ఆ తరువాత అయిదు రోజులపాటు నిరంతర అభ్యసనం, శిశు విద్య, నైపుణ్యాలను సంపాదించడం, స్వీయ అభ్యాసనం, విద్య, పాఠ్య ప్రణాళిక, భాషలు నేర్చుకోవడంపై అపోహలు తదితర పలు అంశాలపై చర్చలుంటాయి. మన చదువుల గతిని మార్చే విభిన్న పాఠ్య ప్రణాళికలు, (Seminar on Education) విలక్షణ బోధన పద్ధతులను పరిచయం చేసే దిశగా అయిదు రోజులు మేధోమథన సదస్సులు నిర్వహిస్తామని వందేమాతరం ఫౌండేషన్‌ రాష్ట్ర కార్యదర్శి మాధవరెడ్డి తెలిపారు. దేశానికి ఉపయోగపడేలా విద్యావిధాన రూపురేఖలు మార్చే ఈ చిరుయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. త్వరలోనే రిజిస్ట్రేషన్‌ కోసం వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు.

ఇదీచూడండి: YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య వెనుక పెద్దలు.. వాంగ్మూలంలో దస్తగిరి సంచలన విషయాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.