ETV Bharat / state

బీసీ సంక్షేమ సంఘం నేతల అరెస్టు - kli project

నీటమునిగిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మోటర్లను చూసేందుకు వెళ్తున్న బీసీ సంక్షేమ సంఘం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు. ప్రశ్నించే గొంతులను పోలీసులతో ప్రభుత్వం అణచివేస్తోందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రచాల యుగంధర్ గౌడ్ అన్నారు.

bc leaders arrested in nagarkurnkool district
బీసీ సంక్షేమ సంఘం నేతలను అరెస్టు చేసిన పోలీసులు
author img

By

Published : Oct 20, 2020, 5:31 PM IST

ప్రశ్నించే గొంతులను పోలీసులతో అణచివేస్తూ, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కులను కాలరాస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రచాల యుగంధర్ గౌడ్ మండిపడ్డారు. నాగర్​కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు దగ్గర నీట మునిగిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మోటర్లను చూడడానికి వెళ్తున్న బీసీ సంక్షేమ సంఘం నేతలను పోలీసులు అడ్డుకున్నారు.

పోలీసులకు, బీసీ సంఘం నేతలకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసులు నేతలను అరెస్ట్ చేసి పోలీస్​ స్టేషన్​కు తరలించారు. నీట మునిగిన కేఎల్ఐ ప్రాజెక్ట్ మోటర్లను చూడడానికి వెళ్తుంటే అరెస్ట్ చేయడం దారుణమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రచాల యుగంధర్ గౌడ్ అన్నారు.

మోటర్ల ముంపుకు మంత్రి నిరంజన్ రెడ్డి బాధ్యత వహించాలని అన్నారు. 200 మీటర్ల దగ్గర బ్లాస్టింగ్ చేయకూడదని ప్రభుత్వానికి తెలియదా అంటూ ప్రశ్నించారు. 4 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని 2లక్షల ఎకరాలకు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. పోలీసులతో ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని విమర్శించారు.

ఇవీ చూడండి: ముంపు బాధితులను ఆదుకోవడంలో ముందుంటాం: తలసాని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.