చట్టాలపై మహిళలకు అవగాహన కలిగి ఉండాలని ఆత్మకూరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మహమ్మద్ భోక్తియార్ పేర్కొన్నారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని పద్మావతి జూనియర్ కళాశాలలో డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆధ్వర్యంలో మహిళా చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, పోలీసులు, షీటీం సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
దిశ ఆత్మకు శాంతి చేకూరాలని నిమిషం పాటు మౌనం పాటించారు. విద్యార్థులు, మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. మహిళలను హింసిస్తే కఠిన చట్టాలు ఉంటాయని గుర్తుకు రావాలన్నారు. సదస్సులో 100, 112లపై అవగాహన కల్పించారు.
ఇదీ చూడండి: ఉత్తర్ప్రదేశ్లో మహిళలకు చోటేది: ప్రియాంక గాంధీ