దేశానికి అన్నం పెట్టే స్థాయికి రాష్ట్రం వచ్చిందంటే అది సీఎం కేసీఆర్ ముందు చూపుతోనేనని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిర్ంజన్రెడ్డి తెలిపారు. మరో ఏడాది లోపు పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేసి ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. నాగర్ కర్నూల్లో నిర్వహించిన వానకాలం 2020 నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై నియోజకవర్గ స్థాయి రైతుల అవగాహన సదస్సులో నిరంజన్‌రెడ్డితో పాటు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
దశాబ్ద కాలం తర్వాత ప్రపంచ వ్యవసాయ చిత్రపటంలో అన్ని రకాల పంటలు పండించే ప్రాంతంగా తెలంగాణ మారుతుందని మంత్రి ఆకాంక్షించారు. దిగుమతుల వ్యవసాయం నుంచి ఎగుమతుల స్థాయికి చేరుకోవడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మూస ధోరణిలో కాకుండా వైవిధ్యమైన పంటలు వేసి రైతులు లాభాలు ఆర్జించాలని మంత్రులు సూచించారు.