ETV Bharat / state

మినీ పోల్స్​: ప్రశాంతగా ముగిసిన పోలింగ్​... గెలుపుపై ఉత్కంఠ - achampet polling updates

నాగర్​కర్నూల్​ జిల్లా అచ్చంపేట పురపాలికలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 68 శాతం పోలింగ్ నమోదు కాగా... అత్యధికంగా 96.92 శాతం రెండో వార్డులో పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా 20వ వార్డులో 52.92 శాతం పోలింగ్ నమోదైంది.

achampet municipal polling completed
achampet municipal polling completed
author img

By

Published : Apr 30, 2021, 9:47 PM IST

Updated : May 1, 2021, 3:47 AM IST

నాగర్​కర్నూల్​ జిల్లా అచ్చంపేట పురపాలిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 20,684 ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా.. 14,055 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 68 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా రెండో వార్డులో 96.92 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా 20వ వార్డులో 52.92 శాతం పోలింగ్ నమోదైంది.

గెలుపుపై ఉత్కంఠ...

2016లో జరిగిన నగర పంచాయతీ ఎన్నికలతో పోల్చుకుంటే పోలింగ్ శాతం తక్కువే నమోదైందని చెప్పొచ్చు. గత ఎన్నికల్లో మొత్తం 18,614 ఓటర్లకు గానూ 13,193 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అప్పట్లో 70 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో అత్యధికంగా ఓట్లు గెలుచుకున్నది తెరాసనే. 20వ వార్డుల్లో 20 వార్డులు తెరాస అభ్యర్ధులే గెలుచుకున్నారు. కానీ.. ఈసారి తెరాస, భాజపా, కాంగ్రెస్ పార్టీలు పురపాలిక ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. అన్ని వార్డుల్లోనూ మూడు పార్టీలు అభ్యర్ధుల్ని బరిలో నిలిపాయి. ప్రధాన పోటీ మూడు పార్టీల మధ్యే ఉండనుంది. పార్టీల భవితవ్యం ప్రస్తుతం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది. ఫలితాల కోసం అన్నిపార్టీల అభ్యర్ధులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

వార్డుల వారీగా పోలైన ఓట్ల వివరాలు...

వార్డు నెంబర్మొత్తం ఓట్లుపోలైన ఓట్లుపోలింగ్ శాతంవార్డు నెంబర్మొత్తం ఓట్లుపోలైన ఓట్లుపోలింగ్ శాతం
1వ వార్డు108772166.6211వ వార్డు95262665.75
2వ వార్డు110585096.9212వ వార్డు 94061165
3వ వార్డు941 66370.4513వ వార్డు1078 780 72.35
4వ వార్డు96161964.4114వ వార్డు1088 771 70.86
5వ వార్డు97567268.9115వ వార్డు1106 754 68.17
6వ వార్డు93972076.6716వ వార్డు964 729 75.62
7వ వార్డు95276279.9917వ వార్డు1035 738 71.3
8వ వార్డు110779271.5218వ వార్డు993 678 68.27
9వ వార్డు111865658.6719వ వార్డు1069 626 58.55
10వ వార్డు121473660.6220వ వార్డు1060 56152.92

Last Updated : May 1, 2021, 3:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.