ETV Bharat / state

నాలుగేళ్ల క్రితం అదృశ్యం.. 'సఖి' పుణ్యాన మళ్లీ ప్రత్యక్షం - పాలెం గ్రామానికి చెందిన తప్పిపోయిన మహిళ ఆచూకీ లభ్యం

భర్త మరణాన్ని తట్టుకోలేని భార్య మతిస్థిమితం కోల్పోయింది. ఇల్లు వదిలి నాలుగేళ్లయింది. అప్పటినుంచి తల్లి కోసం కుమారుడు వెతుకుతూనే ఉన్నాడు. చివరకి తన ప్రయత్నం ఫలించింది. చండీగఢ్‌లోని సఖి కేంద్రంలో ఉన్నట్లు తెలుసుకున్న ఆ కుమారుడు.. తల్లి దగ్గరికి చేరి పులకరించిపోయాడు.

a woman who went missing four years ago have been found with the help of sakhi in chandigarh
నాలుగేళ్ల క్రితం తప్పిపోయిన మహిళ ఆచూకీ లభ్యం
author img

By

Published : Feb 15, 2021, 8:52 AM IST

నాలుగేళ్ల కిందట తప్పిపోయిన తల్లిని.. ఆమె కోసం కంటి మీద కునుకు లేకుండా వెతుకుతున్న కుమారుడిని కలిపింది చండీగఢ్‌లోని సఖి కేంద్రం. నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం పాలెం గ్రామానికి చెందిన దుగ్యాని లక్ష్మమ్మ, చిన్నయ్య భార్యాభర్తలు. అయిదేళ్ల కిందట చిన్నయ్య అనారోగ్యం పాలై మృతిచెందారు.

భర్త మరణాన్ని తట్టుకోలేని చిన్నమ్మ మతిస్థిమితం కోల్పోయింది. నాలుగేళ్ల కిందట ఇల్లు వదిలి వెళ్లిపోయింది. నాటి నుంచి తల్లి కోసం కుమారుడు మహేశ్‌ తిరగని ప్రదేశం లేదు. ఎక్కడా ఆచూకీ లభించలేదు. చివరి ప్రయత్నంగా పాలెంకు చెందిన తెరాస నేత గోవిందు నాగరాజు ద్వారా స్వచ్ఛంద సంస్థలు, అనాథ శరణాలయాలకు లక్ష్మమ్మ వివరాలు పంపించారు. చండీగఢ్‌లోని సఖి కేంద్రంలో ఉన్నట్లు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లారు. శనివారం రాత్రి తల్లిని కలిసిన మహేశ్‌ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఇదీ చూడండి: తెబొగకాసం గౌరవ అధ్యక్షురాలిగా కవిత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.