ETV Bharat / state

'ఆటో బోల్తా... 8 మందికి తీవ్ర గాయాలు'

ప్రమాదావశాత్తు ఆటో బోల్తా పడి 8 మందికి తీవ్ర గాయాలైన ఘటన నాగర్​ కర్నూల్​ జిల్లా చుక్కాయిపల్లిలో చోటుచేసుకుంది.

'ఆటో బోల్తా... 8 మందికి తీవ్ర గాయాలు'
author img

By

Published : Sep 28, 2019, 11:20 AM IST

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం చుక్కాయిపల్లిలోని చెరువు కట్ట వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు క్షతగాత్రులను కొల్లాపూర్​లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్​ ఒక్కసారిగా బ్రేకు వేయడం వల్ల ఆటో అదుపు తప్పి, బోల్తా పడిందని ప్రయాణికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఆటోను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

'ఆటో బోల్తా... 8 మందికి తీవ్ర గాయాలు'

ఇదీ చూడండి:భూటాన్​లో కూలిన భారత హెలికాప్టర్- ఇద్దరు పైలట్లు మృతి

Tg_mbnr_15_27_auto_boltha_8mandiki _gaayalu_av_ts10097 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం చుక్కాయిపల్లి చెరువు కట్ట దగ్గర ఆటో బోల్తా పడి 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా ఆసుపత్రికి తరిలించారు. గాయాలు అయిన వారిని కొల్లాపూర్ ఆసుపత్రికి తరిలించారు. కొల్లాపూర్ నుండి ముక్కిడిగుండం వెల్లుతుంటే సంఘటన చోటుచేసుకుంది. ఆటోలో 20 మందిని ఎక్కించుకొని వెల్లుతుంటే బాటలో కుక్క, పంది రావడంతో ఒక్కసారిగా ఆటో డ్రైవర్ బ్రేక్ వేయడంతో ఆటో బోల్తాపడిందాన్ని ప్రయాణికులు తెలిపారు. కొంతమంది ప్రయాణికులకు కళ్ళు, చేతులు విరిగిపోయాయి. ఒక్కరికి తలకు బాగా దెబ్బ తగిలింది. ముగ్గురికి సీరియస్ గా ఉండడంతో జిల్లా ఆసుపత్రికి తరిలించారు. ముక్కిడిగుండం గ్రామానికి ఆర్టీసీ వారు బస్సు సరిగా నడపకపోవడంతో ప్రయాణికులు ఆటోలను ఆశ్రయించడాం జరుగుతుందాన్ని ప్రయాణికులు ఆరోపించారు. విద్యార్థులకు దసరా సెలవులు రావడంతో గ్రామానికి వెళ్ళడానికి రాత్రి అవుతుండడంతో ఆటో పోవడం జరిగిందాన్ని ప్రయాణికులు అన్నారు. రాత్రి సమయంలో ముక్కిడిగుండం గ్రామానికి ఆర్టీసీ బస్సులు నడపాలని ప్రయాణికులు డిమాండ్ చేశారు. పోలీసుకు సంఘటన స్థలానికి చేరుకొని ఆటో ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.