ETV Bharat / state

ACCIDENT: నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఘోరప్రమాదం.. 2 కార్లు ఢీ.. ఏడుగురు మృతి

8-people-died-in-two-cars-collided-incident-at-nagarkarnool-district

author img

By

Published : Jul 23, 2021, 7:31 PM IST

Updated : Jul 23, 2021, 10:24 PM IST

22:17 July 23

ప్రమాదంపై ప్రధాని మోదీ స్పందన...

  • తెలంగాణాలో నాగర్ కర్నూల్ వద్ద జరిగిన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు నా సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడినవారు అతి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.

    — PMO India (@PMOIndia) July 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రధాని సంతాపం

నాగర్‌కర్నూల్‌ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ట్విటర్​లో ద్వారా వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడినవారికి రూ.50 వేల పరిహారం ప్రకటించారు.

22:16 July 23

సీఎం కేసీఆర్​, మంత్రుల స్పందన...

  • నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పట్ల సీఎం శ్రీ కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

    — Telangana CMO (@TelanganaCMO) July 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సీఎం కేసీఆర్​ దిగ్భ్రాంతి...

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, మంత్రులు శ్రీనివాస్​ గౌడ్, ఇంద్రకరణ్​రెడ్డి​ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాచారం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు ఫోన్ చేసి... ఘటనా పూర్వాపరాలను తెలుసుకున్నారు. తక్షణమే క్షతగాత్రుడికి మెరుగైన వైద్య సేవలందేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యేను సీఎం ఆదేశించారు.

19:27 July 23

ACCIDENT: ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కార్లు... ఏడుగురు మృతి

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఘోరప్రమాదం.. 2 కార్లు ఢీ.. ఏడుగురు మృతి

        నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌- శ్రీశైలం హైవేపై ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరోకరికి తీవ్రగాయాలు కాగా... హైదరాబాద్​కు తరలించారు. శ్రీశైలం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారు... హైదరాబాద్​ నుంచి శ్రీశైలం వైపు వెళ్తున్న మరో కారు... ఉప్పునుంతల మండలం చెన్నారం గేట్‌ వద్ద అతివేగంతో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు కార్లు నుజ్జునుజ్జవగా.. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. శ్రీశైలం నుంచి హైదరాబాద్‌కు వెళ్లే కారులోని ముగ్గురు మృతి చెందగా.. హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం వెళ్లే కారులోని నలుగురు మృతి చెందారు. 

కార్లలో చిక్కుకున్న మృతదేహాల వెలికితీత..

      సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. కారులో చిక్కుకున్న మృతదేహాలను వెలికితీస్తున్నారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రున్ని అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. చీకటి పడటంతో సహాయక చర్యలకు ఆటంకమేర్పడింది. సాధ్యమైనంత తర్వగా కార్లలో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసి అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శర్మన్‌,  అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

మృతదేహాల గుర్తింపు...

హైదరాబాద్‌- శ్రీశైలం రహదారిపై చెన్నారం గేటు వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో రెండు కార్లు అతి వేగంతో ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని పోలీసులు వెల్లడించారు. ప్రమాదానికి గురైన కార్లలో ఒకటి హైదరాబాద్‌కు చెందిన వారిదిగా గుర్తించారు. మృతులు జీడిమెట్లకు చెందిన వంశీ, నిజాంపేటకు చెందిన వెంకట్‌, పటాన్‌చెరుకు చెందిన నరేశ్‌, ఆనంద్‌బాగ్​కు చెందిన శివకుమార్​గా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలు అంచనా వేస్తున్నారు.  మృతదేహాల వద్ద లభ్యమైన గుర్తింపు కార్డులు, కారు నంబర్ల ఆధారంగా మృతుల బంధువులకు పోలీసులు సమాచారమందిస్తున్నారు.

ఇవీ చూడండి: 

Last Updated : Jul 23, 2021, 10:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.