ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను హత్య చేసిన కేసులో ఏ2 నిందితురాలైన స్వాతి రెడ్డికి నాగర్ కర్నూల్ కోర్టు 14 రోజుల జుడీష్యల్ రిమాండ్ విధించింది. ఈ కేసులో జైలులో ఉన్న స్వాతి రెడ్డి బెయిల్‌పైన విడుదలైన తర్వాత స్టేట్ హోమ్‌లోనే ఉంది. కోర్టు విచారణ కోసం హాజరు కావాల్సిన సమయంలో ప్రజలు తనను ఇబ్బంది పెడుతున్నారని.. తనకు పోలీస్ రక్షణ కావాలని ఆమె కోర్టును కోరింది. అయితే ఈ విషయం.. కేసు విచారణలపై జనవరి 31న స్వాతి రెడ్డి నాగర్ కర్నూల్ కోర్టుకు రావాల్సి ఉన్నా రాలేదు. దీనిపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
హాజరు కానందుకే..
వారెంట్ ఇష్యూతో స్టేట్ హోమ్‌లో ఉన్న స్వాతి రెడ్డిని.. అరెస్ట్ చేసి నాగర్ కర్నూల్ కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరపరిచారు. కోర్టుకు హాజరు కానందుకు స్వాతి రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. అక్కడినుంచి ఆమెను మహబూబ్ నగర్ జిల్లా మహిళా జైలుకు తరలించారు. ఇదే కేసులో మరో ఏ1 నిందితుడు రాజేశ్ సరైన సమయంలో కోర్టుకు హాజరవుతున్నట్లు సమాచారం.
ఇవీ చూడండి: వైష్ణవి ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ ఆత్మహత్య