నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చంద్రబండతండాలో కరోనా కోరలు చాస్తోంది. తండాలో 320 మందికి పరీక్షలు చేయగా 110మందికి పాజిటివ్‌గా తేలింది. ఇటీవలె ముత్యాలమ్మ పండుగ కోసం వలస వెళ్లిన గిరిజనులు హైదరాబాద్, ముంబయి నుంచి సొంతూరికి వచ్చారు. ఈ క్రమంలో వైరస్ వ్యాప్తి పెరిగింది. సర్పంచ్ రాంలాల్ నాయక్, జడ్పీటీసీ గౌరమ్మ వెంటనే అప్రమత్తమై... తండాలో సోడియం హైపో క్లోరైడ్‌ని పిచికారి చేయించారు.
ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ ఆర్థిక సాయంతో కొవిడ్ బారిన పడిన కుటుంబాలకు కూరగాయలను పంపిణీ చేశారు. అందరూ మాస్కులు ధరించాలని, కరోనా నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు. తండాలో స్వచ్ఛంద లాక్ డౌన్ విధించారు. చుట్టూ కంచె ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: జడలు చాస్తున్న మహమ్మారి... పదిరోజుల్లోనే రెట్టింపు కేసులు