ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జంపన్న వాగుకు నీరు చేరుకుంది. గత మూడు రోజుల క్రితం లక్నవరం సరస్సు నుంచి నీటి పారుదల శాఖ అధికారులు నీరు విడుదల చేశారు. లక్నవరం సరస్సు నుంచి 30 కిలోమీటర్లు దూరంలో ఉన్న జంపన్నవాగు మూడు రోజుల వ్యవధిలో నీరు చేరుకుంది.
వేలాది మంది తరలివచ్చే భక్తజనం సంప్రదాయబద్ధంగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించుకుంటారు. అనంతరం గద్దెలకు చేరుకొని గిరిజన దేవతలైన సమ్మక్క-సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజును దర్శించుకుంటారు.
ఇవీ చూడండి: కరోనా: చైనాలో 212కు చేరిన మృతులు.. ఎమర్జెన్సీ విధింపు