ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు వద్ద గోదావరి వరద పరవళ్లు తొక్కుతోంది. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో పాటు చత్తీస్గఢ్, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురువడం వల్ల రెండు రోజుల నుంచి గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం పేరూరు వద్ద 31 అడుగులకు వరద నీరు చేరుకుంది. గురువారం ఉదయానికి వరద నీటి ప్రవాహం మరింత పెరగగలదని అధికారులు భావిస్తున్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు