Medaram 2022 Song: రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతరకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. వేలాదిగా వచ్చే భక్తుల కోసం ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశ నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో పోలీసు శాఖ భారీ బందోబస్తును ఏర్పాటుచేసింది.
మేడారం జాతర విశేషాలు సహా పోలీసులు చేస్తున్న కృషిని వివరిస్తూ వరంగల్ ట్రాఫిక్ ఎస్సై రామారావు తనదైనశైలిలో పాటలు పాడుతూ ఉత్సాహపరుస్తున్నారు. 'ఆదివాసుల ఆదిదేవత సమ్మక్క తల్లి బిడ్డలమమ్మ.. ఆదినుంచి మమ్మల్ని కాపాడే దేవతవమ్మ' అంటూ సాగే పాట అందరినీ ఆకట్టుకుంటోంది.
ఇదీచూడండి: Medaram Jatara 2022: జనసంద్రంగా మేడారం.. దర్శనానికి రెండు గంటల సమయం