Medaram Jatara: మేడారం పరిసరాలు కిక్కిరిసిపోతున్నాయి. సమక్క-సారలమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. జంపన్నవాగులో స్నానాలు చేసి వనదేవతలను దర్శించుకుంటున్నారు. జంపన్నవాగులో స్నానాలు చేయడం ద్వారా తమకు మంచి జరుగుతుందని భక్తులు విశ్వాసం వ్యక్తంచేస్తున్నారు.
వనదేవతల సన్నిధిలో కేంద్ర మంత్రులు..
మేడారం సమ్మక్క-సారలమ్మను కేంద్రమంత్రి పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, కేంద్ర గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి రేణుసింగ్ దర్శించుకున్నారు. అమ్మవార్ల దర్శనానికి ముందు కిషన్‌రెడ్డి.. నిలువెత్తు బంగారం తులాభారం సమర్పించారు. అనంతరం అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలకు మేడారం జాతర ప్రతీకని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. రూ.45 కోట్లతో ములుగు వర్సిటీ ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. త్వరలోనే వర్సిటీ పనులు పూర్తిచేస్తామని చెప్పారు. మేడారం పరిసర ప్రాంతాలను ట్రైబల్ సర్క్యూట్‌గా అభివృద్ధి చేస్తామని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా కుటుంబ సమేతంగా మేడారం జాతరకు బయల్దేరి వెళ్లారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి కుటుంబ సభ్యులు సహా ఎంపీ, ఎస్టీ మోర్చా జాతీయ అధ్యక్షుడు సమీర్ ఓరన్, ఇతర నేతలతో కలిసి ర్యాలీగా మేడారానికి వెళ్లారు. ఈ మధ్యాహ్నం వనదేవతలను దర్శించుకోనున్నారు.
ఇదీచూడండి: Medaram jathara 2022: పెద్దమ్మ ఆగమనం.. భక్తజన పారవశ్యం