ETV Bharat / state

దర్శనం కాకముందే దేవుడి దగ్గరికెళ్లిపోయారు.!

author img

By

Published : Feb 4, 2020, 5:53 PM IST

అమ్మవార్లను దర్శించుకుని ఆశీర్వాదం తీసుకుందామని వచ్చారు. మహాజాతరకు వెళ్లి మొక్కులు చెల్లించుకుందామని కుటుంబంతో విచ్చేశారు. కానీ... ఆ వనదేవతల దర్శనం కూడా కాకముందే... విగతజీవులుగా మారారు. ఆద్యాత్మికత నిండిన వాతావరణంలో విషాదఛాయలు నింపారు.

TWO MEN DIED IN MEDARAM JATHARA
TWO MEN DIED IN MEDARAM JATHARA

మేడారం జాతరలో అపశ్రుతి చోటుచేసుకుంది. మేడారానికికు వచ్చిన ఇద్దరు భక్తులు అమ్మవార్లను దర్శించుకోక ముందే అనంతలోకాలకు వెళ్లిపోయారు. సికింద్రాబాద్ మెట్టుగూడకు చెందిన బట్టు వినయ్ అనే యువకుడు కుటుంబసభ్యులతో కలిసి జాతరకు వచ్చాడు. జంపన్నవాగులో పుణ్యస్నానం చేస్తుండగా... వినయ్​కు మూర్చ వచ్చింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే 108లో ఆస్పత్రికి తరలించారు. వినయ్​ను పరీక్షించిన వైద్యులు యువకుడు అప్పటికే మృతి చెందారని తెలిపారు.

దర్శనం కాకముందే దేవుడి దగ్గరికెళ్లిపోయారు...

అదేవిధంగా... దుమ్ముగూడెం మండలం సుబ్బారావుపేటకు చెందిన తామ వినోద్ అనే యువకుడు కుటుంబసభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకుంటుండగా... మూర్చపోయాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి: మేడారం ఎఫెక్ట్: ములుగుకు నలభైరోజుల్లో నాలుగో 'సారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.