ETV Bharat / state

దబ్బకట్ల నర్సింగరావు మృతి ఆదివాసులకు తీరని లోటు

ములుగు జిల్లా రామన్నగూడెంలో తుడుందెబ్బ వ్యవస్థాపకుడు దబ్బకట్ల నర్సింగరావు సంతాపసభను నిర్వహించారు. ఈ సభకు పలువురు హాజరై నర్సింగరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

దబ్బకట్ల నర్సింగరావు మృతి ఆదివాసులకు తీరని లోటు
author img

By

Published : Sep 5, 2020, 11:52 AM IST

ములుగు మండలం రామన్నగూడెంలో తుడుందెబ్బ వ్యవస్థాపకుడు దబ్బకట్ల నర్సింగరావు సంతాప సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్​ ఎంపీ సోయం బాపురావు, స్థానిక ఎమ్మెల్యే సీతక్క, ఆదివాసీ తుడుందెబ్బ నాయకులు, ఉద్యోగస్తులు, ప్రజాప్రతినిధులు పాల్గొని నర్సింగరావు చిత్రపటానికి నివాళులర్పించారు. దబ్బకట్ల నర్సింగరావు మృతి చెందడం ఆదివాసులకు తీరని లోటని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. తుడుందెబ్బ సంఘం ఏర్పడిన తర్వాతనే ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులు బాహ్యప్రపంచాన్ని వెలుగు చూశారని ఆమె అన్నారు. గిరిజనులు పోడు చేసుకున్న భూములకు పట్టాలు అయ్యేంతవరకు పోరాటం చేశారని ఆమె అన్నారు.

గోదావరి లోయ ఆదిలాబాద్ జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు ఏజెన్సీ, అటవీ హక్కు చట్టాలపై సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ అమాయక గిరిజనులకు మంచి సందేశాలు అందించారని ఆదిలాబాద్​ ఎంపీ సోయం బాపురావు అన్నారు. ఎస్టీలు అంటే కోయ జాతికి చెందిన వారేనని లంబాడీ కాదన్నారు. పూర్వం నుంచి ఎస్టీ జాబితాలో ఆదివాసీ కోయలు వస్తున్నారని ఎంపీ సోయం బాబూరావు అన్నారు. 1976లో లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చారని... వారు ఎస్టీలు కాదని తక్షణమే ప్రభుత్వం ఎస్టీ జాబితాలో నుంచి తొలగించాలని ఎంపీ అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం లంబాడీలను ఎస్సీ జాబితాలో నుంచి తొలగించే వరకు గిరిజనులు ఉద్యమం చేపట్టాలన్నారు. అలా చేస్తేనే మృతిచెందిన ఉద్యమ నాయకుడు దబ్బకట్ల నర్సింగరావు ఆత్మ శాంతిస్తుందని ఎంపీ తెలిపారు.

ఇవీ చూడండి: దినకర్మలో సహపంక్తి భోజనాలు... ఊరంతా కరోనా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.