ETV Bharat / state

చెత్తా చెదారంతో కంపు కొడుతున్న మేడారం పరిసరాలు

author img

By

Published : Feb 12, 2020, 10:53 AM IST

Updated : Feb 12, 2020, 3:37 PM IST

ఇటీవల కురిసిన వర్షానికి మేడారం పరిసరాలన్నీ జలమయమైపోయాయి. భక్తులు వదిలేసిన చెత్తాచెదారం, వ్యర్థ పదార్థాలు నీటిలో తడిసి దుర్గందం వెదజల్లుతున్నాయి. దర్శనానికి వచ్చే భక్తులు, స్థానికంగా ఉండే ప్రజలు దుర్వాసన పడలేక నానా ఇబ్బందులు పడుతున్నారు.

the-medaram-jatara-surrounded-with-garbage-at-mulugu-district
చెత్తా చెదారంతో కంపు కొడుతున్న మేడారం పరిసరాలు
చెత్తా చెదారంతో కంపు కొడుతున్న మేడారం పరిసరాలు

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరలో ఇటీవల కురిసిన వర్షానికి పరిసరాలన్నీ జలమాయమైపోయాయి. మేడారం చుట్టూ పలు ప్రాంతాల్లో భక్తులు వదిలేసిన చెత్తాచెదారం, వ్యర్థ పదార్థాలు నీటిలో తడిసి దుర్గందం వెదజల్లుతున్నాయి. దర్శనానికి వచ్చే భక్తులు, స్థానికంగా ఉండే ప్రజలు దుర్వాసన పడలేక నానా ఇబ్బందులు పడుతున్నారు.

కంపు కొడుతున్న మేడారం పరిసరాలు

మేడారం, రెడ్డిగూడెం, ఊరట్టం, కొత్తూరు, నార్లాపూర్, జంపన్న వాగు, చిలకలగుట్ట, పెద్ద చెరువు, తాడ్వాయి రహదారిపై నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో కంపు కొడుతోంది. పారిశుద్ధ్యం పనులు వేగవంతం చేసినప్పటికీ దుర్వాసన వస్తుందని స్థానికులు అంటున్నారు. దుర్గందంకు పారిశుద్ధ్య కార్మికులు కూడా పనులు చేయలేకపోతున్నారని గ్రామస్థులు చెబుతున్నారు.

కుప్పలుగా ఉన్న చెత్త

కుప్పలుగా ఉన్న చెత్తను ట్రాక్టర్లలో ఎత్తుకెళ్లి డంపింగ్ యార్డుకు తరలించాలని కోరుతున్నారు. పారిశుద్ధ్యం తరలింపుకు మరింత ఎక్కువ సిబ్బందిని పెంచాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే మిషన్ భగీరథ నీరు లీకై రోడ్డుపై వృథాగా పారుతోందన్నారు. అలాగే కొనసాగితే దోమలు, ఈగలు పెరిగి రోగాల బారిన పడే అవకాశం ఉందని గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి : సిగరెట్‌ పెట్టె వద్దన్నందుకు కొట్టింది!

Last Updated : Feb 12, 2020, 3:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.