ETV Bharat / state

మావోయిస్టుల కట్టడిపై పోలీసుల దృష్టి.. - Bhadradri Kottagudem District News

మావోయిస్టుల కట్టడిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. తప్పించుకునేందుకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలు, దారులపై ప్రత్యేక నిఘా పెట్టారు. మావోయిస్టులను ఎదుర్కొనేందుకు వ్యూహాత్మకంగా ప్రణాళికలను రచించారని, అవసరమైతే కేంద్ర బలగాలు వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.

ana Policies focus on Maoists strategy
మావోయిస్టుల కట్టడిపై పోలీసుల దృష్టి..
author img

By

Published : Oct 13, 2020, 7:11 AM IST

మావోయిస్టుల కట్టడికి పోలీసులు ప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నారు. వారు దాడిచేసి పారిపోవడానికి అనుకూలంగా ఉన్న దారులపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ముమ్మరంగా కూంబింగ్‌ జరుగుతున్నా.. జంకు లేకుండా ములుగు జిల్లాలో అధికార పార్టీ కార్యకర్తను హతమార్చిన సంఘటన పోలీసుశాఖలో చర్చనీయాంశంగా మారింది. దీనికి గల కారణాలను అధ్యయనం చేస్తున్న అధికారులు ప్రధానంగా భౌగోళిక అంశాలపై దృష్టి సారించారు. తప్పించుకునేందుకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లోనే మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉన్నట్లు గమనించారు. భద్రాద్రి కొత్తగూడెం-తూర్పుగోదావరి డివిజన్‌ కమిటీ కార్యదర్శి కొయ్యాడ సాంబయ్యతోపాటు ఏటూరునాగారం-మహదేవ్‌పూర్‌ ఏరియా కమిటీ కార్యదర్శి ముచ్చకి ఉంగ్లా అలియాస్‌ సుధాకర్‌, చర్ల-శబరి ఏరియా కమిటీ కార్యదర్శి అరుణ తదితరులు చురుగ్గా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు.

భౌగోళికంగా అనుకూల ప్రాంతాలు

ఆసిఫాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల భౌగోళిక స్వరూపం కొంత భిన్నంగా ఉంటుంది. కొత్తగూడెం జిల్లాలోని చర్ల, ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాలు గోదావరి అవతల ఛత్తీస్‌గఢ్‌తో కలిసే ఉంటాయి. ఇది మావోయిస్టులకు అనుకూలించే అంశం. అందుకే ఈ మూడు మండలాల్లో వారి కార్యకలాపాలు విస్తృతంగా ఉన్నాయి. గత ఏడాది చర్ల మండలం మిడిసిలేరు ఎంపీటీసీ శ్రీనివాసరావును హతమార్చారు. నాలుగైదు నెలలుగా ఆ మండలంలో మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ కారణంగానే చర్ల నుంచి ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లే దారుల వెంట చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. అలాగే ములుగు జిల్లాలో తెరాస కార్యకర్త భీమేశ్వరరావును హత్య చేసిన వెంకటాపురం మండలం బోధాపురం గ్రామం ఛత్తీస్‌గఢ్‌కు అనుకునే ఉంటుంది. కొంతకాలంగా ఇక్కడ కూడా మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

గాలింపు సాగుతున్నా దుశ్చర్య

నిజానికి మావోయిస్టులపై పైచేయి సాధించే ఉద్దేశంతో ఇటీవల డీజీపీ మహేందర్‌రెడ్డి, హోంశాఖ సలహాదారు విజయ్‌కుమార్‌, ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశం జరిగిన వారం వ్యవధిలోనే భీమేశ్వరరావు హత్యకు గురవడం గమనార్హం. వాస్తవానికి మావోయిస్టులకు అతడు ప్రధాన లక్ష్యం కాకపోయినప్పటికీ పోలీసులకు హెచ్చరిక పంపే ఉద్దేశంతోనే ఈ హత్యకు పాల్పడ్డారని విశ్లేషిస్తున్నారు. అటు ఆసిఫాబాద్‌లోనూ వారి కార్యకలాపాలు ఉద్ధృతంగానే ఉన్నాయి. మంచిర్యాల-కుమురంభీం డివిజన్‌ కమిటీ కార్యదర్శి మైలారపు ఆదెల్లు అలియాస్‌ భాస్కర్‌ చిన్నచిన్న బృందాలను ఏర్పాటు చేసుకొని చురుగ్గా వ్యవహరిస్తున్నాడు. ఈ మధ్యకాలంలోనే ఆదెల్లు, పోలీసులకు మధ్య మూడుసార్లు ఎదురు కాల్పులు జరిగాయి.

అవసరమైతే కేంద్ర బలగాలు!
4 రాష్ట్రాల పోలీసు అధికారుల నిర్ణయం

మావోయిస్టుల కార్యకలాపాలపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఆదివారం ములుగు జిల్లాలో మావోయిస్టులు తెరాస కార్యకర్తను హతమార్చిన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల డీజీపీ స్థాయి ఉన్నతాధికారులు, మావోయిస్టు ప్రభావిత జిల్లాల ఎస్పీలు సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. మావోయిస్టులను ఎదుర్కొనేందుకు వ్యూహాత్మకంగా ప్రణాళికలను రచించారని, అవసరమైతే కేంద్ర బలగాలు వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.