గుప్పెడు మంది కార్పొరేట్ల కోసం 130 కోట్ల మంది దేశ ప్రజలను తాకట్టు పెడుతున్నారని తెలంగాణ రైతు సంఘం నాయకులు ఆరోపించారు. ములుగు జిల్లా కేంద్రంలో సుమారుగా 50 ట్రాక్టర్లతో నిరసన ర్యాలీ చేపట్టారు. కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
సాగు చట్టాలు రద్దు చేసేంతవరకు ఈ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ఇప్పటికే వ్యవసాయరంగం సంక్షోభంలో ఉందని... స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని కోరారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ఎర్రకోటపై రైతుల జెండా