ETV Bharat / state

RAMAPPA TEMPLE: రామప్ప కట్టడం... ఓ ఇంజినీరింగ్ అద్భుతం - telangana varthalu

దేశంలో ఇన్ని ఆలయాలుంటే రామప్పకే యూనెస్కో ప్రపంచ వారసత్వ హోదా ఎందుకు దక్కింది..? ఈ ఆలయానికున్న ప్రత్యేకతలు అలాంటివి మరి. మరెక్కడా కనిపించని శిల్పకళాకృతులు ఇక్కడ దర్శనమిస్తాయి. ఏ ఆలయంలోనూ లేని విభిన్నమైన సృజన ఇక్కడ ప్రతి శిల్పాన్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. స్త్రీ శిల్పాల మెడలోని హారాలూ ఎంత స్పష్టంగా కనిపిస్తాయో. రాయితో అంత అందంగా నగలు ఎలా చెక్కారో ఇప్పటికీ అంతుబట్టదు. ఏనుగులు, సింహాల శిల్పాల్లోనే కనిపిస్తుంది శిల్పి నైపుణ్యమంతా. నంది విగ్రహమైతే ప్రధాన ఆకర్షణ. ఇలా ఒకటేమిటి..? ఆలయంలోని అడుగడుగునా కాకతీయులకు శిల్ప కళపై ఉన్న ఇష్టం, గౌరవం కనిపిస్తూనే ఉంటాయి.

RAMAPPA TEMPLE: రామప్ప కట్టడం...ఓ ఇంజినీరింగ్ అద్భుతం

author img

By

Published : Jul 26, 2021, 10:17 PM IST

RAMAPPA TEMPLE: రామప్ప కట్టడం...ఓ ఇంజినీరింగ్ అద్భుతం

ములుగు జిల్లాలో వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలో పచ్చని పంట పొలాల మధ్య కొలువైంది రామప్ప గుడి. ఎర్రరాయి ప్రాకారం మధ్యలో కొలువుదీరిన ఈ ఆలయానిది.. 800 ఏళ్ల చరిత్ర. మహా శిల్పి రామప్ప కళా నైపుణ్యం... ప్రతి శిలలోనూ సహజత్వాన్ని నూరి పోసింది. 12 ఎకరాల సువిశాల స్థలంలో... చుట్టూ ఉద్యానవనాలతో అలరారుతోందీ నిర్మాణం. గుడి చుట్టూ కోటగోడ దాని చుట్టూ 30 మీటర్ల వెడల్పు కలిగిన కందకపు ఆనవాళ్లు ఇక్కడ ఉన్నాయి. సముద్ర మట్టానికి 612 అడుగుల ఎత్తులో ఉన్న రామప్ప... నాడు ఓరుగల్లును రక్షించటంలో కీలకంగా నిలిచింది. కాకతీయుల కాలంలో రక్షణ రీత్యా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న ప్రాంతంగా రామప్ప...పేరు పొందింది.

శిల్ప వైభవానికి ప్రతీకలు

దేశంలో ఎన్నో ప్రసిద్ధ ఆలయాలున్నాయి. అవన్నీ శిల్పవైభవానికి ప్రతీకలే. ముఖ్యంగా దక్షిణ భారతంలోని తమిళనాడులో గుడుల్లోని శిల్పకళను ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే. అయితే.. వీటితో పోల్చి చూస్తే.. రామప్పకు మరికొన్ని ప్రత్యేకతలున్నాయి. ఇదో ఇంజినీరింగ్ అద్భుతం. ఈ ఆలయంలో నల్లరాతి నిగారింపులు... పీఠం నుంచి శిఖరం వరకు శిల్పాలు చెక్కిన తీరు మరెక్కడా కనిపించదు. ఉత్తర దక్షిణ దేశ ప్రాంతాల సంప్రదాయాల మేలు కలయికతో ఎర్రని, నల్లని రాళ్లను నిర్మాణంలో వాడారు. ఆలయ శిఖరం బరువు లేకుండా ఉండేందుకు..నీటిలో తేలిపోయే ఇటుకలను ఉపయోగించారు.

అంతా చీకటిగా ఉన్నా..
జీవం ఉట్టిపడే శిల్ప కళాకృతుల సౌందర్యానికి మంత్ర ముగ్ధులు కావాల్సిందే. స్వరాలు పలికే శిల్పాలూ ఇక్కడ తప్ప మరెక్కడా కనిపించవు. రాతి స్తంభాల మధ్య సన్నని దారం పట్టే రంధ్రాలు ఉండటం విశేషం. ఇవేనా..? ఇంకెన్నో విశేషాలున్నాయి ఈ నిర్మాణంలో. ఆలయంలో అంతా చీకటిగా ఉన్నా గర్భగుడిలోని రామలింగేశ్వరుడిపై మాత్రం ఎప్పుడూ వెలుతురు పడుతూ ఉంటుంది. శివ తాండవం, శివకల్యాణం నాట్య రూపాలు, రామాయణ, మహాభారత, పురాణ ఇతిహాసాలు తెలిపే రమణీయమైన శిల్పాలు ఉన్నాయి. ఈ ఆలయం చుట్టూ వివిధ భంగిమలతో 12 మదనికలు, నాగిని, కోయస్త్రీ శిల్పాలు కనువిందు చేస్తాయి.

చెక్కుచెదరని స్తంభాలు

అలనాటి స్త్రీల వీరత్వాన్ని తెలిపే విగ్రహాలే కాదు..వాటి మెడలోని ఆభరణాలూ ఎంతో స్పష్టంగా కనిపిస్తాయి. నేటికీ ఆ రాతి స్తంభాలు చెక్కుచెదరకుండా ఆకర్షిస్తుంటాయి. ఆలయ దర్శనానికి వెళ్లే మార్గాన్ని వరస కట్టిన ఏనుగు బొమ్మలు తెలియజేయడం మరో విశేషం. ఆలయం చుట్టూ ప్రహరీతో పాటు వర్షపు నీరు బయటకు వెళ్లే వ్యవస్థ ఆనాడే ఏర్పాటు చేయటం.. కాకతీయుల నాటి సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనం.

వైపరీత్యాలను తట్టుకుని నిలిచిన కాకతీయ ఘనత

ఎన్నో యుద్ధాలు, పిడుగులు, భూకంపాల్లాంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలిచింది. గర్భగుడికి అభిముఖంగా నంది విగ్రహం, కుడివైపున కామేశ్వర, ఎడమ వైపున కాటేశ్వరాలయాలు నిర్మించారు. వీటి నిర్మాణానికి ఎక్కువగా ఏనుగులనే వినియోగించారు. ఈ గుడిలో ఎన్నో సంస్కృతి, కళలు, సామాజిక అంశాలు కనిపిస్తాయి. రామాయణం, మహాభారతం, క్షీరసాగర మథనం, శివపార్వతుల కల్యాణం లాంటి పురాణ ఇతిహాసాలను శిల్పాలతో చెప్పే ప్రయత్నం చేశారు. నృత్య, యుద్ధ కళలనూ ఇందులో చెక్కారు. పేరిణి శివతాండవ నృత్యరూపకం ఈ గుడిలోని శిల్పాల నుంచి సేకరించినదే. ఆలయానికి కొద్ది దూరంలోనే ఉన్న రామప్ప సరస్సు నిత్యం జలకళతో ఉంటుంది. రెండు గుట్టల మధ్యన తూములు, కట్టను ఏర్పాటు చేసి ఈ సరస్సు నిర్మించారు.

విజ్ఞాన భాండాగారం

కాకతీయుల ఆలయ నిర్మాణాలన్నీ నక్షత్ర శైలిలో ఉంటాయి. రామప్ప గుడి సైతం ఆ ఆకారంలోనే ఉంటుంది. గర్భగుడి, మహామండపంతో మూడువైపులా ప్రవేశానికి వీలు ఉంటుంది. ఎక్కడైనా ఆలయమంటే దేవుడి విగ్రహాలే ప్రధానంగా ఉంటాయి. కానీ ఈ గుడిలో అణువణువూ ప్రత్యేకత సంతరించుకుని కనిపిస్తాయి. కేవలం ఆలయం కోసమే కట్టినట్లయితే ఇంతటి ప్రాచుర్యం పొందేది కాదు. భావితరాలకు సంస్కృతి సంప్రదాయాలు, పురాణేతిహాసాలు, చరిత్రను అందించే విజ్ఞాన భాండాగారంగా తీర్చిదిద్దారు కాకతీయులు.

జీవకళ ఉట్టేపడే విధంగా..

ఆలయానికి మరో ప్రధానాకర్షణ నంది విగ్రహం. గర్భగుడికి ఎదురుగా ఉన్న ఈ నంది శివుని ఆజ్ఞ కోసం వేచిచూస్తున్నట్లు ఉంటుంది. ఎండకు ఎండుతూ వానకు నానుతూ ఉన్నా ఏ మాత్రం చెక్కుచెదరకుండా జీవకళ ఉట్టిపడే తేజస్సుతో ఉంటుంది. దీనిని ఎటునుంచి చూసినా అది మనవైపే చూస్తున్నట్లుగా అనిపించడం శిల్పి గొప్పతనం. ముఖ్యంగా నంది మెడలోని హారాలను చెక్కిన తీరు ఆశ్చర్యపరుస్తుంది. 800 ఏళ్ల క్రితం నాటి కట్టడం నేటికీ చెక్కుచెదరక పోవటానికి కారణం...నిర్మాణంలో శాండ్‌ బాక్స్‌ టెక్నాలజీ వినియోగించడం. ఆలయ నిర్మాణ స్థలంలో 3 మీటర్ల లోతు పునాది తవ్వి అందులో ఇసుక నింపుతారు. అది ఎప్పుడూ తడిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ ఇసుకపై రాళ్లు పేర్చుకుంటూ గుడి నిర్మించారు. అందువల్లే అది ఇప్పటికీ కుంగిపోకుండా దృఢంగా ఉందని నిపుణుల అభిప్రాయం.

నీటిలో తేలియాడే ఇటుకలతో నిర్మాణం

ఆలయం రాతితోనే ఉంటుంది. కానీ గర్భగుడి గోపురం మాత్రం ఇటుకలతో నిర్మించారు. నేల స్వభావానికి అనుగుణంగా ఆలయంపై బరువు తగ్గించడానికి తేలికపాటి ఇటుకను వినియోగించారు. ఇవి నీటిలో తేలియాడతాయి. మనం వినియోగించే వాటి కన్నా చాలా చిన్నగా ఉంటాయి. ఇలాంటి ఇటుకలతో దేశంలో మరెక్కడ కట్టడాలు చేపట్టలేదు. వీటిని ఎలా తయారు చేశారో ఇప్పటికీ ఓ అంతుచిక్కని రహస్యమే. గర్భాలయంలో విద్యుత్తు దీపాలు లేకున్నా శివలింగం స్పష్టంగా కనిపిస్తుంది. గర్భగుడి ముందున్న మహామండపానికి నాలుగు పెద్ద నల్లరాతి స్తంభాలుంటాయి. బయటి వెలుగు వాటి మీద పడి పరావర్తనం చెంది శివలింగంపై ప్రతిబింబించడం వల్ల లింగం తేజోవంతంగా కనిపిస్తుంది.

దక్కకుండా ఉంటుందా... విశ్వఖ్యాతి!

ఆలయంలో చాలాచోట్ల మూడు రంగుల రాళ్లను వినియోగించారు. కొన్నిచోట్ల ఎరుపు, తెలుపు మిశ్రమ రంగుల రాళ్లు కూడా కనిపిస్తాయి. ఆలయం లోపల, మహామండపం, కొన్ని శిల్పాలకు పూర్తిగా నల్లరాళ్లనే వాడగా ఆలయం వెలుపల ఎరుపు, తెలుపు రాళ్లను వినియోగించారు. కొన్నిచోట్ల ఈజిప్టు, పర్షియన్‌ వ్యక్తుల చిత్రాలు కనిపిస్తాయి. ఆ కాలంలోనే విదేశీయులతో సంబంధాలు ఉన్నట్లు వాటి ద్వారా తెలుస్తుంది. జైనులు, బౌద్ధుల శిల్పాలూ కొన్ని ఉన్నాయి. ఆలయం బరువును మోస్తున్నట్టుగా వందలాది ఏనుగుల శిల్పాలను చెక్కారు. అయితే ఒక ఏనుగుతో మరో ఏనుగుకు సంబంధం లేకుండా విభిన్నంగా ఉంటాయి. మరి ఇన్ని ప్రత్యేకతలున్నప్పుడు...విశ్వఖ్యాతి దక్కకుండా ఉంటుందా..?

ఇదీ చదవండి: Ramappa Temple: రామప్ప ఆలయం కాకతీయుల కళాత్మకత, అద్భుత శిల్పసంపదకు నెలవు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.