ETV Bharat / state

రాహుల్ వస్తే ప్రతి పేద కుటుంబానికి రూ.6 వేలు - MAHABUBABAD MP CONTESTANT

ములుగులో చివరిరోజు కాంగ్రెస్ ప్రచార జోరు పెంచింది. మహబూబాబాద్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్​ తరపున ఎమ్మెల్యే సీతక్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.

హోటల్​ కార్మికులను కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్న సీతక్క
author img

By

Published : Apr 9, 2019, 12:52 PM IST

ములుగు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. స్థానిక ఎమ్మెల్యే సీతక్క ఆటో డ్రైవర్లు, లారీ కూలీలు, హోటల్​ కార్మికులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీకే ఓటేసి మహబూబాబాద్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్​ను గెలిపించాలని కోరారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే తెల్లకార్డు ఉన్న ప్రతి కుటుంబానికి నెలకు ఆరు వేల రూపాయల చొప్పున అందిస్తారని పేర్కొన్నారు.చేతి గుర్తుకే ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పోరిక బలరాం నాయక్ గెలిస్తే ములుగు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని సీతక్క పేర్కొన్నారు.

బలరాం గెలిస్తే ములుగు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది : సీతక్క

ఇవీ చూడండి : ప్రచార ముగింపునకు కౌంట్​డౌన్

Intro:tg_wgl_51_09_seethakka_ennikala_pracharam_av_c7_HD
G Raju Mulugu Contributer

యాంకర్ వాయిస్ : ములుగు జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క జిల్లా కేంద్రంలోని వాడ వాడ వీధి వీధి తిరుగుతూ ఇంటింటి ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీ కి ఓటేసి పోరిక బలరాం నాయక్ ను గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని ఓటర్లను కోరారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే తెల్లకార్డు ఉన్న ప్రతి కుటుంబానికి నెలకు ఐదు వేల రూపాయల చొప్పున అందిస్తారని ఆమె అన్నారు. టిఆర్ఎస్ పార్టీ మాటలు నమ్మి వారికి ఓటేస్తే నట్టేట్లో మోస్తారని కారు గుర్తుకు ఓటు వేయకుండా చేతి గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఇంతకుముందు కేంద్రమంత్రిగా ఉన్న పోరిక బలరాం నాయక్ ఎంతో అభివృద్ధి పనులు చేశారని ఇప్పుడు కూడా గెలిస్తే కేంద్రమంత్రి అవుతాడని అప్పుడు మన ములుగు నియోజకవర్గం ఎంతో అభివృద్ధి పధం లో నడిచే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే సీతక్క ఓటర్లను కోరారు. ములుగు పట్టణంలోని ఆటో డ్రైవర్లను , లారీ లో పనిచేసే కూలీలను, హోటల్ లో తిరుగుతూ చేతి గుర్తుకు ఓటు వేయాలని ఎమ్మెల్యే సీతక్క ఓటర్లను కోరారు.

Body:ss

Conclusion:no
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.