Police defused landmines: ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు సమీపంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన పేలుడు పదార్థాలను పోలీసులు నిర్వీర్యం చేశారు. ఈ ఘటనలో.. ఓ ప్రెజర్ కుక్కర్, 20 మీటర్ల కార్డెక్స్ వైర్, రెండు డిటోనేటర్లు, 33 బ్యాటరీలు, మదర్ బోర్డులు, కండెన్సర్లు, కెమెరా ప్లాష్, వైర్ బెండిల్స్ లాంటి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.
కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులను చంపాలనే ఉద్దేశంతో కంకేర్ ఆర్పీసీ సభ్యులతో పాటు కొంత మంది మిలీషియా సభ్యులు కలిసి.. ఈ పేలుడు పదార్ధాలను అమర్చినట్లు ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు. గతంలో కూడా మావోయిస్టులు అమర్చిన మందుపాతరల వల్ల అమాయక గిరిజనులు, పశువులు మరణించాయని తెలిపారు. ఈసారి మాత్రం ఎలాంటి నష్టం జరగకముందే.. పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేశామన్నారు.
ఇదీ చూడండి: